ఆజిల్లాలో టీడీపీ నేతలు గప్‌చుప్‌..కారణం ఇదే !

-

అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించారు. చేతిలో పవర్‌ లేకపోయేసరికి జనమే గుర్తు లేరు. ఏడాదిగా నోరు విప్పితే ఒట్టు అని అంటున్నారు. గెలిపించలేదని జనంపై కోపమో ఏమో కానీ పూర్తిగా సైలెంటయ్యారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో సైతం అంటిముట్టనట్లుగానే ఉన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా నేతలకు దక్కినన్ని పదవులు రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కలేదు. 2014 ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. పార్టీని బలోపేతం చేయాలని పదవుల పందారం పెట్టారు. మంత్రి పదవులు, మండలి చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎన్నో జిల్లా నేతలకు వరించాయి. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ పదవులు పందేరం సాగింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో బలపడలేదు. ఒక్కటంటే ఒక్క సీటూ గెలవలేదు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలోని టీడీపీ నేతలు ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అయ్యారు. ఇద్దరు ముగ్గురు నేతలు ప్రజాసమస్యలు, కార్యకర్తలపై పెడుతున్న కేసులపై అప్పుడప్పుడూ మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడుతుంది. జిల్లాలో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం కావడంతో ఆ ఊసే లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్లకు పరిమితం అయ్యారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు నల్లపూసయ్యారు. పార్టీ పిలుపిస్తున్న నిరసన్లలో పాల్గొనడం లేదు.

జిల్లాకి చెందిన వైసీపీ మత్రి గుమ్మనూరి జయరాం పై భూదందా ఆరోపణలు వచ్చినా జిల్లా టీడీపీ నేతలు అంతంతమాత్రంగానే స్పందించారు. ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. టీడీపీ రాష్ట్ర కమిటీ చూపిన చొరవ కర్నూలు టీడీపీ నేతలు చూపలేకపోయారన్న విమర్శ ఉంది. పేరుకి పెద్ద పెద్ద నేతలంతా పార్టీలో ఉన్నా కేడర్ ను పట్టించుకునే నేతలు మాత్రం కరువయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version