L. RAMANA : టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణ

-

తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ… టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ చేతులమీదుగా ఎల్ రమణ…. టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.

ఈ సందర్భంగా రమణకు కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. కొందరు ప్రతిపక్ష నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారని ఫైర్ అయ్యారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని… సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version