తమ ఊరికి అమ్మ ఒడి వద్దు అని తీర్మానించారు ఆ గ్రామ ప్రజలు. దీంతో ఆ ఊరికి వచ్చిన మంత్రి షాక్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన తగిలిన వైనం ఇది. కర్నూలు జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విభిన్న వాతావరణం నెలకొంది. దీంతో మంత్రి ఎంత చెప్పినా కూడా మహిళలు వినలేదు. ఆఖరికి గ్రామ వలంటీరును పిలిచి సర్దిచెప్పినా కూడా మహిళలు వినలేదు. అర్జెంటుగా తమ సమస్య పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంత్రుల్లో టెన్షన్
రెండు నెలల పాటు సాగే గడపగడపకూ.. కార్యక్రమంలో భాగంగా వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కారించాలన్న విషయమై ఇప్పటికే మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. అంబటి రాంబాబు మొదలుకుని ఇవాళ కొందరు మంత్రులు మీడియా ముఖంగా తప్పులు మాట్లాడి దొరికి పోయారు. ముందుగా పథకాల సరళిని ప్రశ్నిస్తూ ఆసరా అంటే ఏంటి అని అడగడం అది కాస్తా వివాదంగా మారడం అంబటి పర్యటనలో చోటు చేసుకున్న వివాదం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఓ లబ్ధిదారుడితో మాట్లాడుతున్న సందర్భంగా చోటు చేసుకున్న సంభాషణ వైరల్ అయింది.
- ఇక రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల సరళిని తెలుసుకున్నారు.
- మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పర్యటనలు సజావుగా సాగగా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు ఆనవాలుగా మారేయి.