తిరుపతి స్విమ్స్ లో ఏర్పాటు చేసిన పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్ లో నిన్న అర్ధ రాత్రి జరిగిన ఒక ప్రమాదంలో కరోనా రోగులను లోపలి బయటకు తీసుకు వెళ్ళే లేడీ అటెండర్ మృతి చెందింది. తిరుపతి స్విమ్స్ లో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ అలానే ఫస్ట్ ఫ్లోర్ ని కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. అయితే ఆపైన మూడంతస్తుల నిర్మాణం పనులు మాత్రం మరో పక్క జరుగుతున్నాయి.
అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న రాధిక అనే అటెండర్ మీద పడింది. ఆమెతో పాటు అక్కడే కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి అప్పుడే వస్తున్న మరో ఇద్దరి మీద కూడా పడగా వారు అదృష్టవశాత్తూ గాయాల పాలయ్యారు. అయితే ఆ పడే స్లాబ్ కూడా భారీ శబ్దం చేస్తూ కూలిపోవడం రాధిక సహా మరో ఇద్దరి ఆర్తనాదాలతో మిగతా సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు. తీవ్ర గాయాలతో పడిఉన్న ఉన్న రాధికను అంబులెన్స్ లో స్విమ్స్ ఎమర్జన్సీకి తరలించినా అప్పటికే మరణించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.