షాకింగ్ : సుత్తి, మాంసం కొట్టే కత్తితో హెయిర్ కట్..

ఒకప్పుడు కేవలం బార్బర్ షాప్ కు హెయిర్ కట్ కు వెళ్ళేవారు. ఇప్పడు ఆ హెయిర్ కట్ కోసమే కాక బార్బర్ షాపులలో అనేక రకాల సర్వీసులు కూడా అందిసున్నారు. అయితే అందరిలా చేస్తే తనకేమి గుర్తింపు వస్తుంది అనుకున్నాడో ఏమో ?పాకిస్తాన్లో ఒక బార్బర్ తన కస్టమర్ యొక్క జుట్టు స్టైల్ చేయడానికి సుత్తులు, మాంసం కొట్టే కసాయి కత్తి, నిప్పు అలానే గాజును ఉపయోగిస్తూ ఫేమస్ అయ్యాడు.  లాహోర్ కు చెందిన అలీ అబ్బాస్ తన కస్టమర్ జుట్టు కత్తిరించడానికి అసాధారణ పద్ధతులను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జుట్టు కత్తిరింపు యొక్క సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడానికి అబ్బాస్ శిక్షణ పొందారు. అయితే “ప్రతిరోజూ ఒకేలా జుట్టు కత్తిరిస్తే కిక్కు ఏముంది అనుకున్న ఆయన కొత్త మార్గాలతో జనాన్ని ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఒక సుత్తి లేదా కత్తిని ఉపయోగించినప్పుడు, అది నాకు ఒక రకమైన ప్రయోగం మరియు దానిని ఇబ్బంది లేకుండా వాడడానికి ఒక సంవత్సరం పాటు శిక్షణ కూడా పొందానని మీడియాకి చెప్పుకొచ్చాడు