గోదావరి వరదలతో మునిగిపోయిన లక్ష్మీ పంప్‌హౌస్ మోటర్లు ఎట్టకేలకు తేలాయి. జులై 21న పంపుహౌస్ నుంచి నీటి తోడివేత పనులు ప్రారంభించిన అధికారులు.. భారీ సామర్థ్యం గల పంపులతో 15 రోజులపాటు 21.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని తోడి వేశారు.
ఇందుకోసం 1360 HP సామర్థ్యం గల 8 పంపులను వినియోగించారు. కింది భాగంలో ఇంకా కొంత వరదనీరు తొలగించాల్సి ఉంది. ఈ పనుల్లో 500 మంది సిబ్బంది, కూలీలు పనిచేస్తున్నారు.
పంపుహౌస్‌ను పరిశీలించడానికి నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి త్వరలో రానున్నారు. రామగుండం ENC నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించి.. భవిష్యత్తు కార్యాచరణపై ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేస్తారు.
పంపుహౌస్‌లోని 17 మోటార్లను ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. కొన్ని దెబ్బతినడంతో.. వాటిని ప్రాథమికంగా పరిశీలించేందుకు ఆ దేశాల ఇంజినీరింగ్ నిపుణులు బృందం రెండురోజుల్లో రానున్నట్లు సమాచారం.