గతంలో దశమహావిద్యలలో మొదటి ఐదింటి గురించి తెలుసుకున్నాం. తర్వాతి ఐదు మహావిద్యల విశేషాలు ఇవే…
ఆరవరూపం త్రిపురభైరవి : సృస్టిలో పరివర్తన అనునది ఎల్లపుడునూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూలకారణము. ఈ త్రిపురభైరవి నృసిం హభగవానుడి అబ్బిన్నశక్తిగా చెప్పబడినాడు.
ఏడవరూపం ధుమావతి : ఈమె కూడ ఉగ్రరూపమే. ఆగమములలో ఈమెని అభావసంకటాలను దూరం చేయునట్టి రూపంగా వర్ణించారు. ఐతే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలూ, కలహదారిద్ర్యముల న్నింటికి ఈమే కర్త. ఆమె అనుగ్రహముంటే సకటములన్నీ దూరమవుతాయి. రాహుగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఎనిమిదవరూపం భగళాముఖి : ఐహిక, దేశ, సమాజ, శత్రు శమనార్ధం ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రధమముగా బ్రహ్మదేవుడు భగళామహా విద్యోపాసన చేసాడు. విష్ణువు, పరశురాముడు భగళాముఖీ దేవతా ఉపాసకులే. కుజ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజ చేయడం మంచిది.
తొమ్మిదవరూపం మాతంగి : గృహస్థజీవితాన్ని సుఖవంతంచేసి పురుషార్ధములను సిద్ధింపచేసే శక్తి ఉన్న రూపం. ఈమెను మతంగముని కుమార్తెగా కూడా పిలుస్తారు.
పదవరూపం కమలాలయ : వస్తు సమృద్ధికి ప్రతీక. భార్గవులచేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు కూడ ఉంది. శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజవలన ఫలితాన్ని పొందుతారు
– శ్రీ