ఇప్పుడంతా స్క్రిప్ట్! ఎన్టీఆర్ వల్ల మొదటి సీజన్ హైలైట్.!

-

బిగ్ బాస్ గేమ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే నే చూసే మనం ఇక సెలబ్రిటీలు కొట్టుకుంటూ ఉంటే ఉండగలమా. అదే బిగ్ బాస్ షో కు రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం. ఇక గత సీజన్స్ తో పోల్చితే  ఈ సీజన్ మరీ దారుణంగా ఉందని నెటిజన్స్ దొమ్మెత్తి పోశారు.ఇక రేటింగ్స్  గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఇక బిగ్ బాస్ షో సీజన్స్ లో మొదటి మాత్రం సూపర్ హిట్ అయ్యింది, ఈ సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండటం, బిగ్ బాస్ కొత్త కాబట్టి నిజమయిన సినిమా, టీవి సెలబ్రిటీలు కంటెస్టెంట్లు గా రావటం తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.ఇక మొదటి సీజన్ లో పాల్గొన్న సమీర్ సంచలన కామెంట్స్ చేసాడు.మా సీజన్ చూసి ఇప్పటవి చూస్తూంటే అన్ని స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నట్లు గా కనపడుతుంది అంటూ కామెంట్స్ చేసాడు.

అలాగే మొదటి సీజన్లో హీరో సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడక నేను వెళ్ళిపోతా అంటే ముందు బిగ్ బాస్ వాళ్లు ఒప్పుకోలేదు.ఎలిమినేషన్‌ ద్వారా వెళ్లిపోతే ఓకే కానీ తనంతట తానుగా వెళ్లాలంటే తిరిగి రూ.25 లక్షలు కట్టాలి . డబ్బులు కట్టడానికైనా  రెడీ కాని నేను ఉండను అని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.చాలా డల్ గా అయిపోయాడు. సంపూర్ణేష్ బాబు పరిస్థితి చూసి తారక్‌ బిగ్‌బాస్‌ టీమ్‌తో మాట్లాడాడు. డబ్బులు ఏమి కట్టకుండా సంపూ ను హౌస్ నుండి ఇంటికి పంపాడు, ఆయన ఉండటం వల్ల షో సూపర్ గా నడిచింది, అని జూ ఎన్టీఆర్ మంచితనం గురించి చెప్పుకొచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news