గాన కోకిల, భారత రత్న లతా మంగేష్కర్ మరణించడం దేశ సినీ పరిశ్రమ, సంగీత అభిమానులకు, ఆమె అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోవిడ్ తో జనవరి 8న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులుగా ఆమె కోవిడ్ పై పోరాడాతున్నారు. అయితే కోవిడ్ నుంచి బయటపడిన ఆమె ఆరోగ్యం అనూహ్యంగా విషమించింది. దీంతో ఆమె ఈరోజ మరణించారు.
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోనే లతా మంగేష్కర్ మరణించినట్లు బ్రీచ్ కాండీ హస్పిటల్ డాక్టర్ ప్రతీత్ సంధాని వెల్లడించారు. కోవిడ్ కారణంగా ఆమెకు 28 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నామని.. పోస్ట్ కోవిడ్ తర్వాత అవయవాల వైఫల్యం వల్ల ఆమె మరణించారని డాక్టర్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ.. కోెలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో నిన్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు తెలిపారు. ఈ రోజు ఆమె కన్నుమూశారు.