రేపే ‘హంట్’ స్ట్రీమింగ్.. విడుదలైన 15 రోజులకే ఓటీటీకి సుధీర్‌బాబు సినిమా

-

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హంట్. భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత వి ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

అలాగే మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, ఘట్టమనేని మంజుల, చిత్ర శుక్ల, మౌనిక రెడ్డి, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 26వ తేదీన రిలీజ్‌ అయి.. అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసింది. ఈ సినిమా అదే తేదీ నుంచి ఆహా వీడియోలో కూడా ప్రసారం కానుందని తాజా సమాచారం. ఇదే విష యాన్ని తెలుగు డిజిటల్ ప్లాట్ ఫారమ్ అయిన ఆహా వీడియో ధృవీకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version