హీరో నాని ఎంట్రీతో ‘సరిపోదా శనివారం’ తాజా షెడ్యూల్..!

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ .ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది . యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సాగుతోంది. ఇందుకు సంబంధించి మార్చి 18 నుండి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ షెడ్యూల్ లో హీరో నానితో సహా మిగతా నటీనటులు కూడా పాల్గొనేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్స్ కొన్ని షూటింగ్ చేయ నున్నారు. ఈ సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయి.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news