దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రంలో మే 13 న ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ….ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నియంతృత్వానికి చరమగీతం పాడుదాం అని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలను వంచించిన మోడీ సర్కార్ కి బుద్ది చెబుదాం అని పిలుపునిచ్చారు. ప్రజా పాలన అందిస్తున్న చేయి గుర్తుకు ఓటేద్దాం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.దేశ భవిష్యత్ ను పునఃనిర్మించుకుందాం. మోడీని బై బై చెబుదాం అని తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించుకుందాం అని అన్నారు.కాగా, ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు