Lavanya Tripathi : బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే అందాలు.. తగ్గేదేలే అంటున్న లావణ్య

-

‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సొట్టబుగ్గల సోయగం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఆ తర్వాత నటించిన ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలలో లావణ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ హీరోయిన్ నటించిన ‘దూసుకెళ్తా, శ్రీ రస్తు శుభమస్తు, అర్జున్ సురవరం, ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలా ఈ ఈ భామకు కొంత కాలంగా కలిసి రావడం లేదు. గతేడాది వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి రూటు మార్చింది. మోడ్రన్ గర్ల్ గా లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా చేసింది. యాక్షన్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ పిక్చర్ లో నరేశ్ అగస్త్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

జూలై 15న ఈ సినిమా విడుదల విడుదల అయి మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే తాజాగా బ్లాక్‌ కలర్ డ్రస్ లో ఈ బ్యూటీ మెరిసింది. ఈ ఫోటోల్లో తన ఎద అందాలను ఆరబోసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version