బంగ్లాదేశ్ ఘటనల వెనుక పాకిస్తాన్ , చైనా – బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

-

బంగ్లాదేశ్ ఘటనల వెనుక పాకిస్తాన్ , చైనా కుట్రలు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ… పాకిస్తాన్ , చైనా ప్రోద్బలం తోనే బంగ్లాదేశ్ ఘటనలు జరుగుతున్నాయన్నారు.

Key comments by BJP Parliamentary Board Member Laxman

హిందువుల పై దాడులు జరుగుతున్నాయని… రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడుల పై స్పందించడం లేదని ఆగ్రహించారు. ఈ దేశాన్ని కులాల పేరుతో, మతం పేరుతో విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మమత బెనర్జీ ఓట్ల కోసం రోహింగ్యాలకు అన్ని కల్పిస్తున్నారని తెలిపారు. పశ్చిమ దేశాలు, అరబ్బు దేశాలు మన దేశాన్ని బలహీన పర్చాలని చూస్తున్నాయని తెలిపారు. విచ్ఛిన్నకర శక్తుల సవాళ్లను ప్రతి భారతీయుడు కులాలు, మతాలకు అతీతంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version