జాతీయ‌జెండా ఎగుర‌వేసి..జగన్‌ కు వార్నింగ్‌ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

-

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ‌జెండా ఎగుర‌వేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అప‌ర కాళీ అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం వంటి ప‌థ‌కం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో… అన్న క్యాంటీన్ల‌తో 5రూపాయ‌ల‌కే భోజ‌నం పెట్టే ప‌థ‌కం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

Pawan Kalyan hoisted the national flag for the first time as Deputy CM

ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది,స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి,ఎక్కడ రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి విచ్చలవిడి గా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందన్నారు. శేషా చలం అడవులు లో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటక లో అమ్ముకున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version