Pakistan vs Bangladesh: పాక్‌ సంచలన నిర్ణయం..ఇక ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ మ్యాచ్‌..!

-

Pakistan vs Bangladesh: పాక్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది పాక్‌. ఆగస్టు 21న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో సిరీస్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరగనుంది.

No Spectators Allowed In Pakistan vs Bangladesh Test Match In Karachi. This Is The Reason

ఈ తరుణంలోనే… కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణల కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ప్రేక్షకులను అనుమతించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న వేదిక వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టుకు కరాచీ స్టేడియంలోకి అభిమానులను అనుమతించబోమని పీసీబీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version