ఉద్యోగులకు ఫేస్‌బుక్ షాక్.. 11వేల మందిపై వేటు

-

ఫేస్​బుక్ మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే వేలమంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ తాజాగా మరో 11వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మెటా.. సుమారు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. ఈ సారి కూడా దాదాపు 11 వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్​లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులను సైతం ఆపివేయనున్నట్లు వాల్​స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వీటితో పాటుగా కొన్ని టీమ్​లను సైతం రద్దు చేయనుందని తెలిపింది. మెటాకు సంబంధించిన హార్డ్​వేర్, మెటావర్స్ డివిజన్ అయిన రియాల్టీ ల్యాబ్స్​లో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తీసేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version