మనలో చాలా మంది కుడిచేతితో రాస్తారు. చిన్న పనైనా పెద్ద పనైనా సరే కుడి చేతి తోనే చేయడం ముందు నుంచి అలవాటుగా మారుతుంది. కుడి చేతికి ఉన్న బలం, ఎడమ చేతికి ఉండదు. అలాగే ఎడమ చేతికి ఉన్న బలం కుడి చేతికి ఉండదు. వందలో ఒకరో , ఇద్దరికో ఎడమ చేతివాటం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు కూడా. వారి ఆలోచన విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.అయితే చాలామంది ఎడమ చేతి అలవాటు ఉన్నవాళ్ళకి గేలి చేస్తారు, ఆటపట్టిస్తారు.అసలు ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుంది…?? ఎడమ చేతి వాటం ఉన్నవారిలో ప్రత్యేకతలు ఏమిటి…?? అనే విషయాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఎడమ చేతివాటం గుట్టు విప్పారు…
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అఖిరా విబర్గ్ అధ్యయనం చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. చాలా మందికి ఉండే అపోహ ఏమిటంటే, మధ్యలోనే పిల్లలకి ఈ అలవాటు వస్తుంది అనుకుంటారు కానీ పుట్టుకతోనే ఈ అలవాటు ఉంటుందట. అంతేకాదు వాళ్ళ మెదడు భాగంలో కూడా మార్పులు జరుగుతాయట. ఈ మార్పులు అన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరుగుతాయట. ఇంకొక విశేషం ఏమిటంటే..
భాషకి సంభందించిన విషయాలని మెదడు కుడి, ఎడమ భాగాలలో వీరికి ప్రత్యేకంగా నిక్షిప్తమై ఉంటుందట.సుమారు నాలుగు లక్షల మందిపై పరిశోధనలు చేయగా దాదాపు 33 వేల మందికి ఎడమ చేతి వాటం వాళ్ళు ఉన్నారని. వీరి మెదడుల నిర్మాణం ఒకేలా లేకపోవడం గుర్తించారు. ఎడమచేతి అలవాటు రావడానికి ప్రధాన జన్యువులేనని గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే వీరికి బాషా పరిజ్ఞానం అధికంగా ఉంటుందని ,వీరు చాలా ప్రత్యేకంగా ఉంటారని వారి అధ్యయనంలో తేలిందట.