సుశాంత్ కేసును క్లోజ్ చేయాల‌ని చూస్తున్న ముంబై పోలీసులు: క‌ంగ‌నా ర‌నౌత్

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ముంబై పోలీసులు సుశాంత్ కేసును క్లోజ్ చేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించింది. ఈ మేర‌కు ఆమె గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోలో మాట్లాడింది. సుశాంత్ సింగ్ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేసేందుకు తాను మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని తెలిపింది. అభిమానులంద‌రూ #CBIforSSR అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరింది.

mumbai police trying to close sushant case saya kangana

కాగా సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ కృతి, అత‌ని మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండేల‌కు కంగ‌నా త‌న వీడియో మెసేజ్‌ను ట్యాగ్ చేసింది. ఇక శ్వేతా సింగ్ కూడా సుశాంత్ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌ని కోరింది. #CBIforSSR హ్యాష్ ట్యాగ్‌కు ఫ్యాన్స్ మ‌ద్ద‌తు తెల‌పాల‌ని వేడుకుంది. ఈ క్ర‌మంలో శ్వేతా సింగ్ పోస్టును అంకిత లోఖండే రీపోర్ట్ చేసింది. తాను కూడా అందుకు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇక సుశాంత్ కేసు విష‌య‌మై రియా చ‌క్ర‌వ‌ర్తి పెట్టుకున్న పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు ఇప్ప‌టికే విచారించి తీర్పును గురువారంకు వాయిదా వేసింది. ఈ క్ర‌మంలో మ‌రికొద్ది గంట‌ల్లో ఈ విష‌య‌మై వివ‌రాలు తెలియ‌నున్నాయి.