చర్మానికి, జుట్టుకి నిమ్మ బాగా ఉపయోగపడుతుంది..!

-

నిమ్మకాయల తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. చర్మానికి మరియు జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. నిమ్మకాయ లో ఉండే తొనలు నుండి తొక్కలు వరకు చాలా పనికొచ్చే గుణాలు ఉన్నాయి. నిమ్మరసం లో విటమిన్ సి మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం పై జిడ్డు తగ్గుతుంది. అంతే కాదు నిమ్మకు సంబంధించిన పదార్థాలను ముఖానికి ఉపయోగించడం వల్ల మరింత యవ్వనంగా కనబడుతారు.

నిమ్మ తొక్క లో గైలిమెనన్ అనే పదార్థం ఉంటుంది. దాని వల్ల చర్మం పై ట్యూమర్లు రాకుండా చేస్తుంది. దాంతో చర్మ క్యాన్సర్ ను అడ్డుకొంటుంది. ఎక్కువగా ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, నిమ్మ కాయలను ముఖానికి ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.

ముఖానికి తాజా నిమ్మరసాన్ని లేదా నిమ్మ తొక్కలను వాడితే ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది. మార్పు వచ్చిన తరువాత నిమ్మరసాన్ని లేదా నిమ్మ తొక్కలను
వాడవలసిన అవసరం ఉండదు.

నిమ్మ రసం మరియు బేకింగ్ సోడా ను కలిపి, దంతాలకు అప్లై చేసుకుని, ఆ తర్వాత బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు మరింత తెల్లగా కనబడతాయి.

తరచుగా నిమ్మ రసాన్ని సేవించే వారి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చేతులు, కాళ్లు, పాదాలు
మృదువుగా మారేందుకు కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది.

నిమ్మరసం మరియు పంచదారను కలిపి పెదవులకు స్క్రబ్ గా వాడవచ్చు. దాంతో పెదవుల పై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి, మృదువుగా కనబడతాయి.

తలపై ఉన్న చుండ్రును పోగొట్టేందుకు నిమ్మరసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారానికి రెండు సార్లు నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించితే చుండ్రు బాధ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news