లెనోవో నుంచి త్వరలో Tab P11 Plus.. షాకిచ్చిన కాస్ట్‌..!

-

లెనోవో నుంచి బడ్జెట్‌లో మిడ్ రేంజ్‌ ట్యాబ్‌లను రిలీజ్‌ చేస్తోంది. బెస్ట్‌ ఫీచర్స్‌తోనే ఇది త్వరలో ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుంది. Tab P11 Plus పేరుతో ఇది మార్కెట్‌లోకి రానుంది. ట్యాబ్‌ ఫీచర్స్‌, కాస్ట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Lenovo Tab P11 Plus ధర..

ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ వేరియంట్ ధర కేవలం 209.99 డాలర్ల నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 16,600. ఈ ధర ఆధారంగా ఈ లెనోవో టాబ్లెట్ రూ.20,000 లోపు ధరతో ఇండియాలో లాంచ్ అవ్వొచ్చని టెక్ నిపుణులు భావించారు. కానీ.., 6GB+ 128GB వేరియంట్ ట్యాబ్ ధర రూ. 25,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
స్లేట్ గ్రే అనే ఒకే కలర్ ఆప్షన్‌లో లాంచ్ అయ్యింది.

Lenovo Tab P11 Plus స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ట్యాబ్‌ P11 ప్లస్ డ్యూయల్-టోన్ బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్‌, వేరు చేయగల కీబోర్డ్, పోగో-పిన్‌లు, 6GB RAM+128GB స్టోరేజ్, MediaTek Helio G90T ప్రాసెసర్‌, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ (Micro SD Card) ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు.
కంపెనీ ట్యాబ్‌కు భవిష్యత్తులో ఎన్ని అప్‌డేట్‌లను అందిస్తుందో తెలియాల్సి ఉంది.
ఇందులో అందించిన 7,700 mAh బ్యాటరీ 15 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
వెనుక 13MP ప్రైమరీ కెమెరా, ముందు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
ఈ ఫ్రంట్ కెమెరాతో వీడియో కాల్స్‌ చేయవచ్చు.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఎనేబుల్ చేయవచ్చు.
ఈ ట్యాబ్ బ్లూటూత్ 5.1తో పాటు ముఖ్యమైన సెన్సార్లు, Wi-Fi వంటి కనెక్టువిటీ ఫీచర్లలతో వస్తుంది. కంపెనీ ఇందులో 20W ఛార్జింగ్ అడాప్టర్‌, టైప్-సి పోర్ట్‌ను ఆఫర్ చేసింది.
లెనోవో ట్యాబ్‌ MediaTek Helio G90T ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే రూ.25,999 ధరలో ఈ ప్రాసెసర్ కంటే మరింత మెరుగైన ప్రాసెసర్ గల ట్యాబ్‌ని సొంతం చేసుకోవచ్చు.
ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ ప్రాసెసర్‌ ఉత్తమమైనది కాదు కాబట్టి దీని ధరను కొంచెం తగ్గించి కంపెనీ తీసుకు రావాల్సింది.
అయితే డిస్‌ప్లే చిన్నదిగా ఉంది కాబట్టి MediaTek Helio G90T మెరుగైన పర్ఫామెన్స్, క్వాలిటీని అందిస్తుందని చెప్పొచ్చు.
ఇక ఇందులో అందించిన 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ధర పరంగా ఆశించదగినది కాదు.
ఇంచుమించు ఇదే ధరల్లో యూజర్లు 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లే పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news