వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నేడు, రేపు గుంటూరు వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షపడిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాటు చేస్తున్న వైసీపీ శ్రేణులు. అయితే.. ఈ ప్లీనరీలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న ప్లేట్లు బయటపడ్డాయి. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్విట్టర్ లో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు. ఇదేంటని నిలదీసిన దళిత యువకులపై దారుణమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లిందని ఫైర్ అయ్యారు లోకేష్.
అవమానంపై నిలదీసిన యువతని అరెస్టు చేయడం దారుణం. దళితులపై దమనకాండ సాగిస్తూ, కుల,మత,ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ జగన్ రెడ్డి గారు వికృతానందం పొందుతున్నారు. దళిత యువత భవితని నాశనం చేసే ఇటువంటి అక్రమ అరెస్టులని నేను తీవ్రంగా ఖండిస్తున్నానున్నారు. బేషరతుగా యువకులపై కేసులు ఎత్తేసి, వారిని జైలు నుంచి విడుదల చేయాలి. అంబేద్కర్ గారిని అవమానించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు. ఇదేంటని నిలదీసిన దళిత యువకులపై దారుణమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లింది.(1/5)#DalitAtrocitiesInAP pic.twitter.com/ohfE2Wa6NF
— Lokesh Nara (@naralokesh) July 7, 2022