ఎముకలు కొరికే చలిలో ‘లియో’ షూటింగ్.. స్పెషల్ వీడియో రిలీజ్

-

తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ తన నెక్స్ట ఫిల్మ్ లియో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందుకోసం చిత్రబృందం గడ్డకట్టించే చలిలో షూటింగ్ చేసింది. 56 రోజుల సుదీర్ఘ షెడ్యూల్​ కు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.  కశ్మీర్ షెడ్యూల్​లో తమ సిబ్బంది ఎంతలా కష్టపడిందో వారి మాటల్లోనే చూపించారు.

“కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో లియో షూటింగ్ జరిగింది. ప్రధాన క్రాఫ్ట్స్ అన్నీ పనిచేశాయి. అయితే కశ్మీర్​లో షూటింగ్ కావడంతో మైనస్​ 10 డిగ్రీల టెంపరేచర్​లో పనిచేయాల్సి వచ్చింది. చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారు. రాత్రి పగలు షూటింగ్ కొనసాగింది. ముఖ్యంగా అక్కడి చలి, మంచు, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ పనులు నిర్వహించారు” అని మేకర్స్​ తెలిపారు.

Video Player is loading.

‘లియో’ చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్​పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్​ పళనిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version