పులి భయంకరమా కుక్కలు భయంకరమా…? కాని ఒక సంఘటనలో కుక్కలే భయంకరం అయ్యాయి. పులికి చుక్కలు చూపించాయి. మనుషులు బయట తిరగాకపోవడం తో ఇప్పుడు అడవి జంతువులు బయటకు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అడవి జంతువుల హడావుడి ఎక్కువగానే ఉంది ఇప్పుడు. ఇలాగే ఒక చిరుత పులి బయటకు వచ్చి కుక్కలను చూసి చెమటలు కక్కి౦ది.
అది ఏంటీ అంటారా..? అవును ఈ ఘటన తెలంగాణాలోని కామా రెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపేట, పోతాయిపల్లి, నందివాడ శివారులో దట్టమైన అడవి ఉంది. ఇందులో పులులు కూడా భారీగానే ఉన్నాయి. అయితే జనాల హడావుడి లేకపోవడంతో ఒక చిరుత పులి గారు పని గట్టుకుని బయటకు వచ్చారు. మధ్యాహ్నం గొర్రెలు కాస్తున్న కొందరు కాపరులకు పులి కనపడింది.
వారి మీద దాడి చేయడానికి చూడగా అక్కడే ఉన్న ఎనిమిది వేట కుక్కలు చిరుతపై దాడికి దిగాయి. ఏం చెయ్యాలో అర్ధం కాక ఒక భారీ పొడవు ఉన్న చెట్టు మీదకు పులి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంది. ఇక ఆ కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బ్రతుకు జీవుడా అంటూ జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్లిపోయింది చిరుత పులి. ఆ పులి అక్కడ అడవి మీద బ్రతికే వారి మీద కూడా దాడికి దిగినట్టు అధికారులకు సమాచారం అందించారు.