సత్యసాయి జిల్లాలో చిరుతల సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

-

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత పులుల సంచారం పెరిగింది. జిల్లాలోని గుడిబండ కొండపై రెండు చిరుతలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే చిరుతల బారి నుంచి తమను రక్షించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

చిరుతల సంచారం గురించి అటవీ శాఖకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రిళ్లు ఒంటరిగా భయటకు వెళ్లాలన్న భయం వేస్తోందని.. దీనికి తోడు ఇంటి ముందు ఉన్న పశువులపై ఎక్కడ చిరుతలు దాడులు చేస్తాయో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చిరుతలను పట్టుకోవాలని వేడుకుంటున్నారు. కాగా, చిరుతలు సంచరిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news