బీఆర్‌ఎస్ సభకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులపై పోలీసులు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. స్టికర్లు, జెండాలు పెట్టకూడదు అంటూ బీఆర్‌ఎస్ సభకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారట పోలీసులు. ఇక అటు ఖమ్మం – తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డు పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు అడ్డుకోవడంతో గులాబీ శ్రేణులు వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని ఆర్టీవో, సిబ్బందిపై ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం కావాలని కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోందని వారు ఫైర్ అయ్యారు.ఇటువంటి చర్యలకు పాల్పడటం తగదని బీఆర్ఎస్ సీనియర్ నేతలు విమర్శించారు.