Liger: “లాస్​ వెగాస్​లో చిల్ అవుతున్న బాయ్స్”.. చార్మీ పోస్ట్ వైర‌ల్

-

Liger: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, డేరింగ్ అండ్ డ‌షింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్‌’. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కుతున్నది. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు పూరీ. భారీ అంచనా న‌డుమ తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్ కూడా ఈ చిత్రంలో న‌టిస్తుండడం మ‌రో విశేషం.

ఇక మ‌న రౌడీ హీరో విజయ్‌ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా చిత్రంగా లైగ‌ర్ తెర‌కెక్క‌నున్న‌ది. సాధార‌ణంగానే పూరీ సినిమా అన‌గానే అంచనాలు ఉంటాయి. అందులోనూ పూరీ, రౌడీ కాంబో సినిమా రాబోతుండ‌టంతో సినిమా అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలి ద‌శ షూటింగ్ భార‌త్ పూర్తి చేయ‌గా.. క్లైమాక్స్ స‌న్నీవేశాల చిత్రీక‌ర‌ణ కోసం చిత్ర యూనిట్ అమెరికా వెళ్లింది.

ఇప్పటికే పూరి, విజయ్‌ దేవరకొండ అమెరికాలోని లాస్‌వేగాస్‌కు చేరుకున్నారు. ఈ షెడ్యూల్‌లో మైక్‌ టైసన్‌, విజయ్‌ల మధ్య క్లైమాక్స్ స‌న్నీవేశాలను షూట్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇక విజయ్‌, పూరీలు కలిసి వేగాస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ రెస్టారెంట్‌తో పాటు కొన్ని లొకేషన్స్‌లో ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఈ ఫోటోల‌ను ఈ చిత్ర నిర్మాత చార్మి త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌
వేదికగా పోస్ట్‌ చేశారు. ‘షెడ్యూల్‌ ప్రారంభానికి ముందు బాయ్స్‌ చిల్‌ అవుతున్నారు’ అంటూ రాసుకోచ్చింది. ఈ చిత్రానికి పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

Read more RELATED
Recommended to you

Latest news