ఓటర్ ఐడిని ఆధార్ తో లింక్ చెయ్యాలంటే ఈ సులువైన పద్దతిలో చెయ్యచ్చు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో వోటర్ ఐడీ కూడా ఒకటి. ఓటర్ ఐడి మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఆధార్ నెంబర్ కి లింక్ చేసుకోవడం అవసరం. ఎన్నికల కమిషన్ వోటర్ ఐడీలకు ఆధార్ నెంబర్లను లింక్ చెయ్యాలని.. లింక్ చేసేందుకు డ్రైవ్‌ను కూడా స్టార్ట్ చేసారు.

voter card
voter card

ఓటర్ ఐడీ కార్డ్ ఉంటే ఆధార్ తో లింక్ చేసేయచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. ఆధార్ ని లింక్ చేస్తే ఒక వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా.. వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా తెలిసిపోతుంది. అందుకే ఓటర్ ఐడీ ఉన్నవారు ఆధార్ తో లింక్ చేయడం ఎంతో ముఖ్యం. మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే ఇలా సులభంగా చేసేయచ్చు.

దీని కోసం మీరు మొదట గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ‘Voter Helpline’ యాప్ ని ఎక్కించండి.
నెక్స్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి.. ‘Voter Registration’ ఆప్షన్ ని ఎంచుకోండి.
ఇప్పుడు మీరు ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన నొక్కండి.
మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు ఓటీపీ వస్తుంది.
‘Yes I have voter ID’ ఆప్షన్ మీద నొక్కండి.
ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి.
‘Fetch Details’ పైన క్లిక్ చెయ్యాలి. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ‘Done’ మీద నొక్కండి అంతే.

 

Read more RELATED
Recommended to you

Latest news