రైలు ఆలస్యమైందా..? అయితే ఈ ఉచితాలు పొందొచ్చు..!

-

చాలా మంది దూర ప్రయాణాలను చేసేందుకు రైలుని ఎంపిక చేస్తుంటారు. అయితే రైళ్లు ఒక్కోసారి సమయానికి రాకపోవచ్చు. ప్రతి రోజూ వేల సంఖ్యలో రైళ్లు వెళ్తూ ఉంటాయి. వాటిలో చాలా రైళ్లు ఆలస్యంగానే వస్తుంటాయి. దీని వలన ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది ఉంటుంది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు చాలా లాభాలున్నాయి. మరి అవేమిటో చూద్దాం.

పైగా వీటిని మనం రూపాయి కూడా కట్టక్కర్లేకుండా ఉచితంగా పొందొచ్చు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు కనుక లేట్ గా వస్తే భారతీయ రైల్వే ఉచితంగా ఫుడ్, డ్రింక్ ని ప్రయాణికులకు ఇస్తుంది. పైగా రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కొన్ని రైట్స్ వున్నాయి. వాటిని తప్పక మనం వాడుకోచ్చు.

ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ లేట్ అయితే ఉచితంగా ఫుడ్‌ను ఇస్తారు. ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ లేట్ అయితే బ్రేక్‌ఫాస్ట్, లైట్ మీల్స్ ఇవ్వాలి. ఒకవేళ రైలు కనుక ఇలా ఆలస్యం అయితే వీటిని మనం రూపాయి కూడా కట్టక్కర్లేకుండా ఉచితంగా పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ మెనూ ని ఫాలో అయ్యి బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, డిన్నర్ ని ఇస్తుందని తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news