పారిస్ సెయింట్ జెర్మైన్ (PSG) తో ఒప్పందానికి ముందుకు కొన‌సాగుతున్న లియోనెల్ మెస్సీ..!

-

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు బదిలీపై లియోనెల్ మెస్సీ పారిస్ సెయింట్ జెర్మైన్ (PSG) తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ మేర‌కు స్పోర్ట్స్ పేపర్ L’Equipe తన వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. రానున్న కొద్ది గంటల్లో అతను పారిస్ చేరుకోనున్నాడు. కాగా అర్జెంటీనా, బార్సిలోనా రెండింటిలోనూ 34 ఏళ్ల రికార్డు గోల్స్ స్కోరర్ అయిన మెస్సీ ప్ర‌పంచంలోని గొప్ప ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో ఒకడు.

లా లిగా కు చెందిన ఫెయిర్ ప్లే ఆట నియమాలపై మెస్సీ ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో క్లబ్ లో ఇకపై ఉండ‌లేనని చెప్పాడు. ఈ క్ర‌మంలోనే త‌న సుదీర్ఘ మిత్ర బృందానికి ఆదివారం అత‌ను వీడ్కోలు పలికాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను భావోద్వేగానికి గుర‌య్యాడు.

PSG ఫ్రంట్‌లైన్ ఇప్పటికే బలీయంగా ఉంది. మెస్సీ మాజీ బార్కా జట్టు సహచరుడు నెయ్‌మార్, యువ ఫ్రాన్స్ స్ట్రైకర్ కైలియన్ ఎంబప్పే గ్రాహంలు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే గ‌త‌ 27 సంవత్సరాలలో 682 తో బార్కా ఆల్‌టైమ్ రికార్డ్ గోల్స్ స్కోరర్ అయిన మెస్సీ రాకతో మొట్ట మొదటి సారిగా ఛాంపియన్స్ లీగ్ గెలవాలని క్లబ్ ఆశిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 245 మిలియన్ల మంది ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బార్సిలోనాకు చెందిన అత్యంత ఉత్త‌మ‌మైన‌ ఆటగాడిగా ఉన్న మెస్సీ రాక.. టీవీ హక్కుల విషయంలో సంక్షోభంలో చిక్కుకున్న ఫ్రాన్స్ లీగ్ 1 కు కూడా నిజంగా శుభ‌వార్తేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version