తాగుబోతుల్లో తెలంగాణనే నంబర్ వన్.. ప్రతి ముగ్గురిలో ఒకరు తాగడమే !

-

తెలంగాణ రాష్ట్రం తాగుబోతులకు అడ్డగా మారుతోంది. మన రాష్ట్రంలో.. మద్యం అమ్మకాలు రోజు రోజు కు పెరగడమే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక మనిషి పుట్టిన తాగడమే, చచ్చిపోయినా తాగడమే.. ఉద్యోగం వచ్చినా, లవ్‌ లో పడినా ఇలా ఎలాంటి చిన్న కార్యక్రమం జరిగినా.. తాగడం మాత్రం కామన్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో.. తాగుబోతుల లిస్టులో తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డు నమోదు చేసుకుంది.

తెలంగాణ వ్యాప్తంగా 27,351 ఇళ్లలోని 27,518 మంది మహిళలు,3,863 మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించగా, ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, సిటీల్లో కంటే పల్లెటూర్లలోనే 49 శాతం మంది మగవాళ్ళు మద్యం సేవిస్తున్నట్టు తేలింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం మత్తులో ఊగిపోతున్నాడు అన్నమాట. అదే సిటీలో అయితే, ప్రతి ముగ్గురిలో ఒకరు తాగుబోతు ఉంటున్నాడట. ఈ విషయంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంచెం బెటర్. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు మద్యం తాగుతున్నట్టు వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version