లిక్కర్ స్కామ్: కేసీఆర్-కేటీఆర్ నో రెస్పాన్స్.!

-

ఇటీవల దేశ రాజకీయాలని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉన్న ఆప్ ప్రభుత్వం భారీ స్థాయిలో లిక్కర్ స్కామ్ చేసిందని అక్కడ బీజేపీ నేతలు ఆరోపించారు. అదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలని కవిత అప్పుడే ఖండించింది..కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి కౌంటర్లు ఇచ్చింది.

అయితే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సి‌బి‌ఐ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది..ఇక ఈ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్నవారిని సి‌బి‌ఐ వదలట్లేదు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలుమార్లు సోదాలు కూడా చేసింది. ఇదే క్రమంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టు జరిగింది. దీంతో నెక్స్ట్ కవిత టార్గెట్ అవుతుందని ప్రచారం మొదలైంది. అనూస్‌ బ్యూటీ పార్లర్‌ డైరెక్టర్‌ కూడా అయిన అభిషేక్‌రావు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యహరించారని, ఆయన ద్వారా నగదు చేతులు మారినట్లు సీబీఐ గుర్తించిందని సమాచారం.

కవితకు గతంలో కొంతకాలం సహాయకుడిగా వ్యవహరించిన బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్ట్‌తో ఇప్పుడు కవిత టార్గెట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కవిత ప్రమేయం గురించి అభిషేక్‌ ద్వారా సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉందని, త్వరలోనే నోటీసులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు పదే పదే వినిపిస్తోంది..అయినా సరే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఈ అంశంపై స్పందించడం లేదు.

అసలు బీజేపీ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చిన వెంటనే కౌంటర్లు ఇచ్చే కేసీఆర్, కేటీఆర్..కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వినిపించిన సరే ఏ మాత్రం స్పందించడం లేదు. ఈ స్కామ్‌ విషయంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే..కేజ్రీవాల్ గట్టిగానే బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్ మాత్రం నో రెస్పాన్స్. బీజేపీపై యుద్ధం ప్రకటించానంటున్న సీఎం కేసీఆర్‌.. నేరుగా కవితపైనే ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. మరి దీని వెనుక ఏముందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version