విశ్వక్ సేన్ “ఓరి దేవుడా” నుంచి మరో అప్డేట్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న హీరో లు చాలా తక్కువగా ఉంటారు. ఫలక్ నుమా దాస్… సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్ సేన్. చేసింది మొదటి సినిమా అయినప్పటికీ… యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్.ఈ సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆ తరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న విశ్వక్సేన్ మరొక సినిమాను అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా మిథిలా పల్కర్ నటిస్తోంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. నేడు సాయంత్రం 5:04 గంటలకు ” గుండెలోన” అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version