మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డికి తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డి నా సవాల్ స్వీకరించాలి… మునుగోడు ఉప ఎన్నికే వద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం… రాజ గోపాల్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ డబ్బులు మునుగోడుకి ఇవ్వాలని.. అలా చేస్తే.. టీఆర్ఎస్ నామినేషన్ కూడా వేయదని ఛాలెంజ్ చేశారు.
18 వేల కోట్లకు రాజగోపాల్ అమ్ముడు పోయారని ఆగ్రహించారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజగోపాల్ కు డెడ్ లైన్ పెడుతున్నానని.. 13 వరకు trs నామినేషన్ వేయదన్నారు జగదీష్ రెడ్డి. ఆ లోపు నిర్ణయం తీసుకోని.. కాంట్రాక్ట్ డబ్బులు మునుగోడుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి మునుగోడుకు నీ కాంట్రాక్ట్ విలువ చేసే డబ్బులు 18 వేల కోట్లు ఇప్పించు అన్నారు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పు కుంటామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.