ఎల్ ఓ సీ సరిహద్దుల్లో పేలుడు..ఇద్దరు జవాన్ల మరణం..

-

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఉగ్రదాడులను తిప్పికొడుతున్నాయి. కాగా తాజాగా ఎల్ ఓ సీ వెంట జరిగిన అనుమాస్పద పేలుడుతో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ కు సమీపంలో పేలుడు సంభవించింది. అనుమానాస్పద పేలుడుతో ఇద్దర జవాన్లు మరణించారు. రెగ్యులర్ గా బార్డర్ ఏరియాలో పెట్రోలింగ్ చేసే సమయంలో పేలుడు సంభవించిదని అధికారులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా పాకిస్తాన్ ప్రోద్భలంతో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. హైబ్రీడ్ టెర్రరిజంతో సాధారణ పౌరులను టార్గెట్ చేస్తున్నారు. లష్కర్ ఏ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు నాన్ లోకల్ వ్యక్తుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా భద్రతా బలగాలు ఇటీవల ఇటువంటి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని వెతికిమరీ చంపింది. కాగా జమ్మూ కాశ్మీర్ లో భద్రతాబలగాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఇటీవల కేంద్ర హోం మంత్రి అక్కడ పర్యటించారు. భద్రతాబలగాలకు దిశానిర్ధేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version