ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుందా… అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ద్వారా తొలగించి ఆ స్థానంలో మద్రాస్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి కనగరాజు ని నియమించింది. ఆయన శనివారం హడావుడి గా చెన్నై నుంచి వచ్చి బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు ఎన్నికలను నిర్వహించమని సూచించే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త ఎన్నికల అధికారిని నియమించడం తనను తప్పించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ… హైకోర్ట్ కి వెళ్ళారు. హౌస్ మోషన్ పిటీషన్ ని ఆయన దాఖలు చేసారు. ఇక ఇదిలా ఉంటే… ఇప్పుడు ఎన్నికలను కొన్ని జిల్లాల్లో నిర్వహించాలని జగన్ సర్కార్ భావిస్తుంది. ప్రస్తుతం కరోనా ఫ్రీ జిల్లాలుగా విజయనగరం శ్రీకాకుళం ఉన్నాయి.
ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించమని ప్రభుత్వం కోరే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వీటిని నిర్వహించాలని ఏపీ సర్కార్ సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ అనేది ఇప్పుడు అత్యవసరం కాకపోయినా వాటి తో జగన్ కి అవసరం ఉంది. ఇక కొన్ని మండలాల్లో అసలు కరోనా ప్రభావం లేదు. అందుకే ఆయా మండలాల్లో కూడా ఎన్నికలను నిర్వహించాలని జగన్ కోరుతున్నట్టు సమాచారం.