లాక్‌డౌన్ 4.0 మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే.. కొత్త‌గా వేటికి అనుమ‌తులిచ్చారంటే..?

-

కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా విధించిన 3వ విడ‌త లాక్‌డౌన్ ఆదివారం (మే 17)తో ముగియ‌డంతో మే 18 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ 4.0ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో కేంద్రం కొత్త‌గా ప‌లు కార్య‌క‌లాపాల‌కు ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతోపాటు రాష్ట్రాల‌కు ప‌లు విష‌యాల్లో నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశం కూడా క‌ల్పించింది. ఇక‌పై రెడ్‌, ఆరెంజ్, గ్రీన్ జోన్ల‌పై రాష్ట్రాలే నిర్ణ‌యం తీసుకుంటాయి. గ‌తంలో ఆయా జోన్ల‌లో ఉండే క‌రోనా కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి జోన్ల‌ను మార్చే విష‌య‌మై కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకునేది. కానీ ఇక‌పై రాష్ట్రాలే స్వ‌యంగా జోన్ల‌ను మార్చుకోవ‌చ్చు. ఇక ఇవే కాకుండా ప‌లు కీల‌క కార్య‌క‌లాపాల‌కు కూడా ఈ లాక్‌డౌన్‌లో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు.

lock down 4.0 guide lines how relaxations are given

లాక్‌డౌన్‌ 4.0లో కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలు, సడలించిన ఆంక్షలు ఇవే…

  • ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 దాటితే కర్ఫ్యూ విధించారు. ఇకపై ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు వ్యాపారాలకు అనుమతి ఉంటుంది. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది.
  • కంటెయిన్మెంట్‌ జోన్లు తప్ప ఇతర అన్ని ప్రదేశాల్లోనూ దాదాపుగా అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.
  • రాష్ట్రాలు పరస్పర సమన్వయం, సహకారంతో బస్సుల్లో ప్రయాణికులు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వవచ్చు.
  • రాష్ట్రాల్లో అంతర్గతంగా బస్సు సర్వీసులు నడిపించుకోవచ్చు.
  • స్టేడియంలలో క్రీడలకు అనుమతులు ఇస్తారు. కానీ క్రీడాకారులకు, సిబ్బందికి తప్ప వీక్షకులకు అనుమతి ఉండదు.
  • జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉంటుంది. అత్యవసరం అయితే విమాన సర్వీసులు నడిపించుకోవచ్చు.
  • మెట్రో రైళ్లను నడిపించకూడదు.
  • స్కూళ్లు, కాలేజీలు, ఇతర అన్ని విద్యాసంస్థలు, ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్లు మూసివేయాలి.
  • అన్ని సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రదేశాలను సైతం మూసివేయాలి.
  • అన్ని రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతుంది.
  • అన్ని మతపరమైన ప్రదేశాలు, కేంద్రాలు మూసి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news