లాక్‌డౌన్ 5.0 లో స‌డ‌లించిన ఆంక్ష‌లు ఇవే..!

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్రం అమ‌లు చేస్తున్న దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ 4.0 మే 31వ తేదీతో ముగుస్తుంది. దీంతో జూన్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ 5.0ను అమ‌లు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో కేంద్రం ఈ విడ‌త లాక్‌డౌన్‌లో ఏయే కార్య‌క‌లాపాల‌కు ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారో ఆ జాబితాను విడుద‌ల చేసింది. దాని ప్ర‌కారం స‌డ‌లించ‌బ‌డిన ఆంక్ష‌ల వివ‌రాలు, నిషేధం కొన‌సాగే కార్య‌క‌లాపాల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

lock down 5.0 relaxations prohibitions list

* దేశ‌వ్యాప్తంగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ 5.0 అమ‌ల‌వుతుంది. కంటైన్‌మెంట్ జోన్ల‌లో జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ ఉంటుంది.

* కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ సూచ‌న‌ల ప్ర‌కారం దేశంలోని ఆయా జిల్లాల‌కు చెందిన అధికారులు కంటెయిన్‌మెంట్ జోన్ల ప‌రిధిని నిర్ణ‌యిస్తారు.

* కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో కేవ‌లం అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తారు.

* బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల‌లో, ప్రయాణాల్లో ఉన్న‌ప్పుడు మాస్కులు క‌చ్చితంగా ధ‌రించాలి.

* బహిరంగ ప్రదేశాల్లో క‌నీసం 6 అడుగల భౌతిక దూరం పాటించాలి.

* ఎక్కువ మంది ఒక్క చోట‌ గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది.

* వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదు.

* మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమానాలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద పార్కులు, బార్లు, ఆడిటోరియంలు మూసి ఉంటాయి.

* కంటెయిన్‌మెంట్ లేని ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలు మినహా దాదాపుగా అన్ని కార్యకలాపాలనూ లాక్‌డౌన్ 5.0 లో భాగంగా దశల వారీగా పునరుద్ధరిస్తారు.

లాక్‌డౌన్ 5.0లో మొద‌టి ద‌శ‌లో కంటెయిన్‌మెంట్ లేని ప్రాంతాల్లో కింది స‌డ‌లింపులు ఇస్తారు.

* జూన్ 8వ తేదీ నుంచి దేవాలయాలు, మత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను తెరుచుకోవ‌చ్చు.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సదుపాయాల సేవలను అందించే ప్ర‌దేశాల‌ను ఓపెన్ చేయ‌వ‌చ్చు.

* షాపింగ్ మాల్స్ ను తెర‌వ‌వ‌చ్చు.

లాక్‌డౌన్ 5.0 లో రెండో ద‌శ‌లో కంటెయిన్‌మెంట్ లేని ప్రాంతాల్లో కింది స‌డ‌లింపులు ఇస్తారు.

* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, కోచింగ్ సంస్థలు మొదలవైన వాటిని తెరుకోవ‌చ్చు.

* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా సంస్థల స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరపవచ్చు.

* ఆయా చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆధారంగా ఆయా సంస్థలను పునః ప్రారంభించే అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటారు.

లాక్‌డౌన్ 5.0 లో మూడో ద‌శ‌లో కంటెయిన్‌మెంట్ లేని ప్రాంతాల్లో కింది స‌డ‌లింపులు ఇస్తారు.

* అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైలు ప్రయాణాలకు అనుమ‌తి ఉంటుంది.

* సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలను ఓపెన్ చేసుకోవ‌చ్చు.

* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత సమావేశాలు, ఇతర పెద్ద సమావేశాల‌కు అనుమ‌తి ఉంటుంది.

* అన్ని ద‌శ‌ల్లోనూ ప్ర‌జ‌లు క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

* దేశమంత‌టా రాత్రి పూట‌ కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు క‌ర్ఫ్యూ ఉంటుంది. కేవ‌లం అత్యవసర సేవ‌ల‌కు మాత్ర‌మే ఆ స‌మ‌యంలో అనుమ‌తినిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news