లాక్ డౌన్ ని పోడిగించాలా…?

-

దేశంలో మరికొంత కాలం లాక్ డౌన్ ని పొడిగిస్తే మంచిది అనే అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు మరింత తీవ్రమవుతుంది. దీన్ని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా లాక్ డౌన్ ని మరింతగా పెంచడం చాలా అవసరమనే అభిప్రాయం ఇప్పుడు పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి పెరుగుతుంది.

కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం దాన్ని కట్టడి చేయడం పెద్ద విషయం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు కరోనా బారిన పడుతున్నారు. వాళ్ళు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ తిరిగారు. వారికి ఇప్పుడు కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. 15 రోజుల తర్వాత వారికి కరోనా పాజిటివ్ అనేది బయటపడింది.

దీనితో ప్రభుత్వాలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించి లాక్ డౌన్ ని పెంచితే కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్యా రెండు వేలకు చేరుతుంది. మరో 300 కి చేరితే మాత్రం అది రెండు వేలు అవ్వడం ఖాయం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త తీసుకుని కట్టడి చేస్తే మాత్రం గ్రామ స్థాయిలోకి కరోనా వైరస్ వెళ్ళే అవకాశం ఉండదు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news