కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించుకున్నాయి. కరోనా నుండి కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం అనుకుని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ వైపే ముగ్గుచూపాయి. ఐతే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గింది. కేసులు తగ్గాయి. మరనాలు తగ్గాయి. ఈ కారణంగా లాక్డౌన్ సడలింపులు పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు ఉదయం 6గంటల నుండి 2గంటల వరకు ఉన్న సడలింపులను సాయంత్రం 6గంటల వరకు చేసింది.
అంటే తెలంగాణ మాదిరి నైట్ కర్ఫ్యూ మాత్రమే ఉండనుంది. ఈ సడలింపులు ఈ నెల 20తర్వాత నుండి అమల్లోకి రానున్నాయి. ఐతే తూర్పు గోదావరి జిల్లా మినహాయించి ఈ సడలింపులు ఉండనున్నాయి. ఈ జిల్లాలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేనందున మధ్యాహ్నాం 2గంటల వరకు సడలింపులు ఉంటున్నాయి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు లాక్డౌన్ సడలింపులు ఉన్నాయన్నమాట. మరి పూర్తి సడలింపులు ఎప్పుడు వస్తాయో!