వరుస వివాదాల్లో ట్విటర్…మరోసారి నోటీసులు జారీ

-

ట్విట్టర్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మధ్య వివాదం రాజుకుంది. కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి ట్విట్టర్ కు ఇటీవల కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. అయితే తాజాగా ట్విట్టర్ కు మరోసారి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా జూన్ 5వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి “ట్విట్టర్” పై కేసు నమోదు అయింది. “ట్విట్టర్” తో పాటు, కొంత మంది పాత్రికేయులు, కాంగ్రెస్ నాయకుల పై కేసు నమోదు అయింది.

ఈ కేసులో భాగంగా భారత్ “ట్విట్టర్” మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఓ వారంలోగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పోలీసు స్టేషన్ కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆేదేశాలు జారీ చేశారు పోలీసులు. కాగా ట్విట్టర్ కు నిన్న హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నటి మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version