లాక్‌డౌన్ వ‌చ్చే ప‌రిస్థ‌తి తీసుకురావొద్దు : మోడీ

-

భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన 20 నిమిషాల ప్రసంగంలో, కోవిడ్ కి తగ్గట్టుగా నిబంధనలు అనుసరించాలని, ఈ మహమ్మారి పై పోరాడటానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని పీఎం మోడీ దేశ ప్రజలను కోరారు. కార్మికుల నమ్మకాన్ని సజీవంగా ఉంచాలని పీఎం మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. వలస కార్మికులు వారు ఉన్న చోట ఉండాలని కోరారు.  కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామన్న ఆయన కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలని అన్నారు.

దేశం నలుమూలలా ఆక్సిజన్‌ కొరత ఉంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని సరిపడా ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం అనే ప్లాంట్లు నెలకొల్పి. వైద్య అవసరాల కోసం ఉత్పత్తి పెంచామని అన్నారు. దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడాలి. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలి అని ఆయన రాష్ట్రాలను చెప్పారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారీ దారులతో పీఎం మోడీ ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించారు, భారతదేశం అంతటా కరోనావైరస్ కేసులలో గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహించారు. సమావేశం ముగిసిన వెంటనే, 18 ఏళ్లు పైబడిన వారు మే 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందడానికి అర్హులు అని ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version