పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతి పక్షాల ఆందోళన, ప్రభుత్వం పట్టుదల నడుమ సభలో చర్చలకు ఆస్కారమే లేకుండా పోతోంది. బుధవారం కూడా విపక్షౄలు నిరసనలకు దిగడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే.. విపక్ష ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఉదయం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మరోసారి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్య సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్య సభ ఎంపీలు కూడా సభలో రచ్చ చేశారు. దీంతో రాజ్య సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు.