తాగేనీటిని ఇలా స్టోర్‌ చేస్తే.. ఆరోగ్యానికి మేలు!

-

తాగునీరు ఎంతో అమూల్యమైన వరం. దీన్ని సరైన విధానంలో స్టోర్‌ చేసుకుని తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అసలే వర్షాకాలం… వరదలతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు మెండు. ఈ నేపథ్యంలో ఈ విధంగా తాగేనీటిని స్టోర్‌ చేసుకుంటే అనారోగ్యాల నుంచి దూరంగా ఉండవచ్చు. నీటిని ముఖ్యంగా మట్టి లేదా రాగి పాత్రలో మాత్రమే స్టోర్‌ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మేలని ఆయుర్వేదిక్‌ నిపుణులు అంటున్నారు.

  • రంజను ఇతర మట్టి పాత్రల్లో మట్టి కణాల మధ్య చిన్న రంధ్రాలు ఉంటాయి. తద్వారా వాటిలో గాలి ఉంటుంది. అందుకే అందులోని నీరు కూడా చల్లగా ఉంటుంది.
  • ఈ మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల శరీరంలో ఎసిడిటీ, చర్మ సమస్యలు తగ్గుతాయి.
  • మట్టి పాత్రల్లోని నీరు కూడా చాలా రుచిగా ఉంటాయి. నీళ్లు తక్కువగా తాగే వారు ఈ పాత్రల్లో నిల్వ చేసుకుంటే ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది.
  • మంచినీటిని స్టోర్‌ చేసుకునే విధానంలో రెండో పద్ధతి రాగిపాత్ర. ఈ పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
  • వాత, పిత, కఫా వంటి రోగాల బారి నుంచి కూడా కాపాడుతుంది. అంతేకాదు రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన రాగి మూలకం కూడా ఈజీగా అందుతుంది. అయితే, ఈ పాత్రల్లో కేవలం చల్లని నీటిని మాత్రమే తీసుకోవాలి.
  • మన పూర్వీకులు కూడా తాగునీటికి గ్లాసులను సైతం రాగివి వాడిన వారు ఉన్నారు. ముఖ్యంగా రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయాన్నే పరగడుపున తాగడం మంచిది. అయితే, రాగి పాత్రల్లో ఆహారాన్ని వండడం లేదా నీళ్లు,పాలు వేడి చేయడం మంచిది కాదు. దీనివల్ల రాగి విషతుల్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news