తెలుగుదేశం పార్టీకి సంబంధించి, నారా లోకేష్ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు ముందు నుంచి పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ఆయన మాట తీరు, తెలుగు స్పష్టంగా లేకపోవడం అలాగే మరి కొన్ని కారణాలతో లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిస్తాడు అంటే చాలామంది ఒప్పుకునేవారు కాదు. దాదాపు నాయకులలో కూడా చాలా మందికి అదే అభిప్రాయం ఉండేది. కానీ నెమ్మది నెమ్మదిగా లోకేష్ మీద ఉన్న అభిప్రాయం మారుతూ వస్తోంది. ప్రస్తుతానికి పార్టీ అధికారంలో లేకపోవడం అలాగే పార్టీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో లోకేష్ వారందరికీ అండగా నిలుస్తున్నాడు. తాజాగా కడప జిల్లాకి చెందిన సుబ్బయ్య అనే టీడీపీ నేత హత్యకు గురయ్యాడు.
నందం సుబ్బయ్య అనే టిడిపి అధికార ప్రతినిధి ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడంతో దానికి సంబంధించి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలాగే ఆయన బావమరిది ఇద్దరూ కలిసి ఆయనను చంపేశారు అంటూ టిడిపి, సహా సుబ్బయ్య కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ అక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏదో చేసేస్తాను అంటూ వార్నింగ్ లు ఇవ్వకుండా, ఫాక్షనిజాన్ని నమ్ముకున్న వారిని ఫ్యాక్షనిజమే మట్టు పెడుతుంది అని అది ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే బావమరిదికి కూడా వర్తిస్తుంది అంటూ లోకేష్ సింపుల్ గా వార్నింగ్ ఇవ్వడంతో తెలుగుదేశం శ్రేణులు ఆయనని ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.