లోకేష్ తీరు: పురుష నాయకులతో ఒక మాట.. మహిళా నాయకులతో మరోమాట!

-

టీడీపీ ఆశాకిరణం చినబాబు మాటలు ఒక్కో నాయకుల దగ్గర ఒక్కోలా.. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒకలా, అమరావతికి వస్తే మరోలా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో.. తాజాగా తెలుగు మహిళ సమావేశంలో పాల్గొన్న చినబాబు… ఏపీలో మధ్యం దుకాణాలు, బెల్టు షాపుల గురించి మాట్లాడుకొచ్చారు!

అవును… అసలు బెల్టు షాపులు అనే పదం ఏపీకి అలవాటు చేసిందే చంద్రబాబు అని చెబుతుంటారు! రాష్ట్రంలో మద్యం ఏరులై పారించిన ఘనత, వీదికో బెల్టు షాపు పెట్టిన చరిత్ర బాబు సొంతం అనేది అందరికీ తెలిసిన విషయమే! అయితే తాజాగా అధికారంపోయే సరికి.. ఏపీలో మద్యం ఏరులై పారుతుందని చెప్పుకొస్తున్నారు చినబాబు!

ఈ విషయంలో టీడీపీ పురుష నేతలతో మాట్లాడిన చినబాబు… సరైన బ్రాండ్లు ఏపీలో దొరకడం లేదని, చెత్త బ్రాండ్లు అమ్ముతున్నారని, ఫలితంగా తాము తాగే బ్రాండ్లు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా మహిళా నాయకులతో మాట్లాడిన చినబాబు… జగన్ మోహన్ రెడ్డి పాలనలో వీధికో బెల్టుషాపు, ఊరికో బ్రాందీషాపు వెలిసాయని చెప్పుకొస్తున్నారు!

ఇప్పుడు చినబాబు ఉద్దేశ్యం… ఏపీలో మొత్తం మద్యాన్ని తీసేయమనా, లేక సరైన బ్రాండ్లు అమ్మమనా? ఈ క్లారిటీ ఫస్ట్ లోకేష్ కి వచ్చేస్తే… తర్వాత జనాలకు వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version