సీఎం జగనుది సిగ్గు లేని జన్మ..ఎవరికో పుట్టిన బిడ్డనూ.. ? : నారా లోకేష్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనుది సిగ్గు లేని జన్మ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ పోస్టరులో ఉన్న ఏ ఒక్క కంపెనీ జగన్ ప్రభుత్వం తెచ్చింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం సీఎం జగనుకు వ్యసనంగా మారిందని.. మళ్లీ ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు లోకేష్‌. ఇదే కాదు రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల్లోనూ వైసీపీ నేత‌లు న‌గ‌లు, విగ్ర‌హాలు ఎత్తుకుపోతున్నార‌ని భ‌క్తుల‌లో అనుమానాలున్నాయని, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, దుర్గ‌మ్మ వెండి సింహాల మాయం, రామ‌తీర్థం రాముడి త‌ల న‌రికివేత ఘ‌ట‌న‌లో ఈ రోజుకీ నిందితులు దొర‌క‌లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version