చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ ఆలయంలో ఈ నెల 17వ తేదీన అర్దరాత్రి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హుండీ పగల గొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత హుండీలో నగదును ఆలయ నిర్వాహకులు మంగళవారం లెక్కించబోగా.. అందులో ఓ లేఖ లభ్యమైంది.
ఆ లేఖలో “నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకపోగా.. కుటుంబంలోనూ సమస్యలు తలెత్తాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.