GO అంటే గవర్నమెంట్ ఆర్డర్.. JO అంటే జగన్ ఆర్డర్ – లోకేష్

-

GO అంటే గవర్నమెంట్ ఆర్డర్.. JO అంటే జగన్ ఆర్డర్ అని ఫైర్‌ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనం కోసం తెచ్చే GOలకంటే.. జగన్ కోసం తెచ్చే JOలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారనే రకం జగన్ మోసపు రెడ్డి అని మండిపడ్డారు.


జనం సొమ్ము దోపిడీకి ఆడని జగన్ నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం పని చేయిస్తూ ప్రజాధనం ధారపోస్తున్నారని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం కాదు.. ప్రజాధనం ఏదో విధంగా కాజేయడమే అని కొత్త సూత్రంతో పాలన సాగిస్తున్నారన్నారు.

వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారని మండిపడ్డారు. వాటి రీఛార్జిల ఖర్చు ప్రజల డబ్బేనని.. వలంటీరు పని చేసేది మాత్రం వైసీపీ కోసమన్నారు.
జనం సొమ్మును జగన్ జలగలా పీల్చేస్తున్నారు… అవినీతి బకాసురుడు జగనాసురుడు ఆకలికి ఆంధ్రప్రదేశ్ ఆహారమైపోతోందని ఆగ్రహించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version