ఏంటి జగన్ రెడ్డి? ఏపీ రోడ్ల పరిస్థితి : నారా లోకేష్ ఫైర్

-

మంగళగిరి పట్టణం 22వ వార్డు రత్నాల చెరువు ప్రాంతంలో నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆరుగురు చిరు వ్యాపారుల స్వయం ఉపాధి కోసం తోపుడు బండ్లు అందించారు లోకేష్. కాలనీల్లో స్థానికులను కలిసినప్పుడు రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని, పాములు, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పారని లోకేష్ పేర్కొన్నారు. రోడ్ల దుస్థితి స్వయంగా చూసాక రోడ్ల మీది నీటి గుంటల్లో వరి నాట్లు నాటి నిరసన తెలిపానని… ఇప్పటికైనా ప్రభుత్వం అడ్డమైన వాదనలు పక్కన పెట్టి, రాష్ట్ర ప్రజలకు సరైన రహదారులు నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇక మంగళగిరి చేనేత కార్మికుల సమస్యలు ఇన్నీ అన్నీ కావు.. మంగళగిరిలో 2400 మగ్గాలు ఉంటే కేవలం 200 మందికే నేతన్న నేస్తం వస్తుందని ఫైర్ అయ్యారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి జగన్ రెడ్డి? ఎన్నికల ముందు అందరికీ నేస్తం అన్న మీరు, మాట మార్చి సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం అనడం దారుణమైన మోసం అని మండిపడ్డారు.

పైగా మీరిచ్చే సాయానికి మించి నూలు సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసారు. వర్షాకాలం మగ్గాల్లో నీరు చేరి ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఏం చేస్తున్నారు? స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎక్కడ? అని నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని గతంలో శాసన మండలిలో పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదెందుకు? రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version